ఆత్మగౌరవం, మనోభావాలు కాదు- వైసిపి ప్యాకేజీ కోసమే

  • శిల్పా నాన్ లోకల్- అరాచకాలు చేస్తారు అన్న మాట మరిచావా
  • ఎమ్మెల్యే శిల్పా రవి ఇలాంటి నాయకులు అవసరమా?
  • విశ్వనాధ్ హిస్టరీ తెలుసుకోండి

నంద్యాల: జనసేన నాయకుడు విశ్వనాధ్ కు ఆత్మగౌరవం, మనోభావాలు ముఖ్యం కాదని వైసిపి నాయకులు ఇచ్చే ప్యాకేజ్ కోసమే పార్టీ మారారని జనసేన నాయకులు గురు, రాచమడుగు చందు, సుందర్ లు ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జనసేన పార్టీలో వున్న సమయంలో విశ్వనాధ్ చేసిన అరాచకాలు బయటపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో విశ్వనాధ్ కు పోగ్రామ్ కమిటీ, సమన్వయ కర్తగా పదవులు ఇచ్చారని అన్నారు.పవన్ కళ్యాణ్ పేరు, జనసేన పేరు చెప్పుకొని పలువురు వద్ద డబ్బులు వసూళ్లు చేశారని ఆరోపించారు. ఆత్మగౌరవం, మనోభావాలు దెబ్బతినడంతో వైసిపిలో చేరానని విశ్వనాధ్ చెప్పడం జబర్దస్త్ షో మించిపోయిందని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీలో వుంటూ కూటమి తరుపున ఒక్క వార్డులో ప్రచారం చేశాడా, ఎవరినైనా పార్టీలో చేర్పించారా అని ప్రశ్నించారు. పార్టీ ఆదేశాల మేరకు ఒక్కసారైనా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు అని అన్నారు. పార్టీలో ఏమి చేయకపోవడంతో తెలుగుదేశం నాయకులు గుర్తించడంతో దూరంగా పెట్టడంతో 300 మందితో వైసిపి లో చేరానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సరిగ్గా వారం క్రితం ఎమ్మెల్యే శిల్పా రవినీ ఉద్దేశించి నాన్ లోకల్ నాయకులు, అరాచకాలు చేయడం శిల్పా కుటుంభానికి వెన్నెతో పెట్టిన విద్య అని ఆరోపణలు చేసిన మాటలు మర్చిపోయావా అని ప్రశ్నించారు. శిల్పా రవి ఇలాంటి నాయకులను పార్టీలో చేర్చుకునే ముందు అతని హిస్టరీ తెలుసుకుంటే అసలు విషయాలు తెలుస్తాయని అన్నారు. పది ఎల్లనుంచి మేము జన సేన లో వున్నాము, 2019 లో విశ్వనాధ్ పాత్ర తెలుసుకోవాలని అన్నారు. గతంలో ఓటు హక్కు లేకపోతే 2021 లో అప్లే చేసి తెప్పించామని అన్నారు. జనసేన అధిష్టానం వద్ద పదవులు తెచ్చుకోవడంతో ఇంతవరకు విశ్వనాధ్ చేస్తున్న అరాచకాలు సహించామని అన్నారు. సిరివెళ్ళకు పవన్ కళ్యాణ్ వస్తె భోజనం బిల్లులు ఇవ్వకుండా ఎగరగొట్టారని, కొన్ని దొంగబిల్లులు పెట్టీ డబ్బులు నొక్కారని ఆరోపించారు. విశ్వనాధ్ వెళ్లిపోవడంతో అతని వల్ల వెళ్లిపోయిన వెయ్యి మంది తిరిగి పార్టీలోకి వస్తున్నారని అన్నారు. నంద్యాలలో ఆత్మగౌరవం దెబ్బతింటే పిఠాపురం, తెనాలి లాంటి ప్రదేశాల్లో ప్రచారం చేయవచ్చుకదా అని ప్రశ్నించారు. మరో విశేషం ఏమంటే 2019లో మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కి ఎన్నికల్లో ప్రచారానికి విశ్వనాధ్ ఖర్చుచేసాడని చెప్పడం విడ్డూరంగా వుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పారు నాయకులు వస్తారు పోతారు జన సేన నాయకులు, కార్యకర్తలు శాశ్వితంగా వుంటారు అని చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తున్నామని అన్నారు. పేదవారి కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అని అలాంటి ఆశయాలతో పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ స్థాపించారని అన్నారు. సేవ చేయడానికి పార్టీలోకి వచ్చారు కానీ డబ్బు కోసం కాదన్నారు. డబ్బు కావాలంటే ఏడాదికి రెండు సినిమాలు తీస్తే కోట్లు వస్తాయని అన్నారు.స్కాం లు చేసేవారిని నేతలు నమ్మొద్దని పేర్కొన్నారు. పవన్ ఆశయాలు నెరవేర్చడం మా లక్షం అన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించడానికి కష్టపడి పనిచేస్తామని అన్నారు. ప్యాకేజీ ల కోసం పార్టీలు మరేవారిని నమ్మవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో దండు మురళీ, బాబా పక్రుద్దీన్, వెంకి, భాస్కర్, సంజీవరాయుడు, తెలుగుదేశం నాయకులు మున్నా, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.