సీతంపేట గ్రామంలో జనసేన గ్రామ బాట రెండవ విడత

పార్వతీపురం నియోజకవర్గం: సంగంవలస పంచాయతీ పరిదిలోని సీతంపేట గ్రామంలో పార్వతీపురం జనసేన పార్టీ నాయుకులు రెండో విడత గ్రామ బాట కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికే మొదట విడత గ్రామ బాట పార్వతీపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయుకులచే విజయవంతంగా నడిపించడంతో రెండో విడత గ్రామ బాట కార్యక్రమం సంగంవలస గ్రామపంచాయతీలో గల సీతంపేట గ్రామంలో కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సీతంపేట గ్రామాన్ని సందర్శించిగా ఆ గ్రామ ప్రజలు పడుతున్న కష్టాలు గురించి చెప్పుతుంటే జనసేన పార్టీ నాయుకులకు హృదయ చెల్లించిపోయింది. ఆ గ్రామ ప్రజలు ఉద్దేశించి జనసేన పార్టీ నాయుకులు పార్వతీపురం మండల అధ్యక్షురాలు అగూరు మణి మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లా కీ 10 కి.మీ దగ్గరలో వున్నా గ్రామానికి కనీస మౌళిక సదుపాయాలు లేక ఆ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అలజింగి జోగారావు గత ఎలక్షన్ సమయంలో ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఓట్లు కోసం ఇంటి ఇంటికి కొళాయి, డ్రైనేజి, సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు పట్టుంచుకోనేది లేదని ఆ స్థానిక ప్రజలు చెప్పడం జరిగింది. మరల మొన్న కూడా వైస్సార్సీపీ ప్రభుత్వం మేము అది చేసాం ఇది చేసాం గొప్పాలు చెప్పుకొవడానికి ఏర్పాటు చేసిన గడప గడప ప్రోగ్రానికి వచ్చినప్పుడు కూడా అవే కళ్ళబొలిమాటలు చెప్పారంటా. ఆ గ్రామం వుండే గర్భిణీ స్త్రీలు అత్యవసర పరిస్థితి ఉంటే రెండు కిలోమీటర్లు పైగా డోలుతో మోసుకొని వెళ్లే పరిస్థితి మరియు ఆ గ్రామంలో చదవు చెప్పడానికి వెళ్లే టీచర్స్ ఆ రోడ్లు వలన చాలా ఇబ్బందిలు ఎదుర్కొంటారు. ఇప్పటికైనా స్టానిక ఎంఎల్ఏ అలజింగి జోగారావు మరియు సంబందించిన అధికారులు వారి మొద్దు నిద్ర వీడి ఆ గ్రామ ప్రజలు కష్టాలు తీర్చవల్సినదిగా మా జనసేన పార్టీ తరుపున విన్నవించుకుంటున్నాము.. ఒక వేళ వారి సమస్యలు తీర్చలేనియెడల వారివెంట జనసేన పార్టీ నాయుకులు నిలబడి బలంగా పోరాటం చేస్తాం. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యంజిల్లా జనసేన పార్టీ నాయుకులు ఖాతా విస్వేశ్వరావు, గుంట్రెడ్డి గౌరీశంకర్, సాయి కిరణ్, అన్నబత్తుల దుర్గ, పాత్ర పవన్, శ్రీను, మహేష్, సోమేశ్, చంటి, రాము, నాని, సంగం వలస జనసైనికులు సీతంపేట ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.