కాలనీ ఏర్పాటు నుండి కాలువలు లేక కలుషితమైన ఎన్ లక్ష్మి రెడ్డిపల్లి

*పనిచేయని ప్రజాప్రతినిధిని రీకాల్ చేసే అధికారం ప్రజలకు ఇవ్వాలి
*రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పులు ఆవశ్యకం
*అది జనసేన తోనే సాధ్యం: జనసేన ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్

గంగాధర నెల్లూరు మండలం, నెల్లెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎన్ లక్ష్మి రెడ్డిపల్లి గ్రామంలో జనసైనికుల కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ఏర్పాటు అయినది మొదలుకొని కాలువలు లేక ఎన్ లక్ష్మి రెడ్డిపల్లి గ్రామస్తులు అనేక ఇబ్బందులకు, అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చక్కని మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో ప్రజాప్రతినిధుల మీద, సంబంధిత అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డంతా బురద, 10 వీధుల్లోనూ గ్రామం బురదమయం అయిందని, ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. పనిచేయని ప్రజా ప్రతినిధిని అది సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీ చైర్మన్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, చివరికి మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అయినా రీకాల్ చేసే అధికారం ప్రజల చేతుల్లోకి రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలా చేసిన నాడు ప్రజా సేవకులైన ప్రజా ప్రతినిధులు తమ విధులను తప్పకుండానిర్వర్తిస్తారని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, అలా చేయకపోతే ప్రజలు ప్రజాప్రతినిధులకు తగిన గుణపాఠం చెబుతారని, రీకాల్ ప్రయోగాన్ని ఉపయోగిస్తారని తెలిపారు. ఈ విధంగా రాజకీయ వ్యవస్థలో సమూలమైన ప్రక్షాళన జరగాలని, అది ఒక జనసేన పార్టీకే సాధ్యమని ఉద్ఘాటించారు. ఎన్ లక్ష్మి రెడ్డిపల్లి గ్రామంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యటన చేసి, పది వీధులను పరిశీలించి వెంటనే డ్రైనేజి నిర్మాణం చేపట్టాలని, అలా చేయక పోతే ఆమరణ దీక్షకు సిద్ధమని జనసేన పార్టీ సిద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే సోమవారం నుండి ఆమరణ దీక్ష చేస్తానని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సచివాలయ సిబ్బంది, మండల అధికారులు ఏమి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిరుపేదల లోనే భగవంతుని స్వరూపం కనపడుతుందని, కాబట్టి మీరంతా వెళ్లి మంచి పనులు చేసి వారిని ప్రసన్నం చేసుకోండి అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి, కార్వేటినగరం ఉపాధ్యక్షులు విజయ్, జనసైనికులు చందు, కిరణ్, రాజశేఖర్, ఉపేంద్ర, శేషాద్రి, హేమంత్, విశ్వనాద్, లోకేష్, శ్రీదర్, సూర్య, బూపాల్, బూపతి పాల్గొన్నారు.