గురజాల పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కోసం జనసేన డిమాండ్

గురజాల పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కలిగి, పత్తి, మిర్చి అధికంగా పండించే ప్రాంతం పల్నాడని ఆయన తెలిపారు. పల్నాడు ప్రాంతంలో ఇంకా కొన్ని గ్రామాలలో పురిగుడిసెలలో నివాసం ఉండే రైతన్నలు ఉన్నారని, అనుకోకుండా రైతులకు సంబందించిన, ఇల్లు, పండించిన పంట అగ్ని ప్రమాదానికి గురైతే, ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఇక్కడ ప్రజలు ఉన్నారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగితే ఆస్థి నష్టంతో పాటుగా, ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉందనే, విషయాన్ని ప్రభుత్వం అర్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, గురజాల పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసి, ప్రజలకు అండగా నిలవాలని ఆయన కోరారు.