న్యాయానికి సంకెళ్ళు – జనసేన, టిడిపిల నిరసన

రాజంపేట: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలం సానిపాయలో గ్రామంలో జనసేన నాయకులు గుగ్గిళ్ళ నాగార్జున టీడీపీ నాయకులు ఎన్ పి రమేష్ ఆధ్వర్యంలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం ఆదివారం సాయంత్రం చేతులకు సంకెళ్లు ధరించి నిరసన తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.