అమెరికాకే అవమానం

ట్రంప్‌, ఆయన మద్దతుదారులు రిపబ్లికన్లు యూఎస్‌ కాంగ్రెస్‌ దాడి చేశారని, ఈ ఘటన అమెరికాకే అవమానకరమని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్‌ క్యాపిటల్‌ భవనంలో సమావేశమైన విషయం తెలిసిందే. వందలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు భవనంలోకి చొచ్చుకువెళ్లి వీరంగం సృష్టించారు. ఈ ఘటన బరాక్‌ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన దేశానికి అవమానకరమని, సిగ్గుపడే క్షణమన్నారు. ట్రంప్‌ చట్టబద్ధమైన ఎన్నికల ఫలితాలపై నిరాధారమైన ఆరోపణలు చేయడంతో అబద్ధాలు చెబుతూ మద్దతుదారులను ప్రేరేపించారని విమర్శించారు. నవంబర్‌ 3న జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్‌ జో బైడెన్‌ సాధించిన విజయంపై రిపబ్లికన్‌ పార్టీ, దాని మద్దతున్న మీడియా మద్దతుదారులకు నిజం చెప్పేందుకు ఇష్టపడలేదన్నారు. ఆ పరిణామాలే ఇప్పుడు మనం చూస్తున్నామని, అవే ఇప్పుడు హింసాత్మకంగా మారాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.