మూడో టెస్టు: వర్షం తరువాత మ్యాచ్ పునఃప్రారంభం

భారత్ తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో మూడో టెస్టు నేడు సిడ్నీలో ప్రారంభమైంది. ఇరు జట్లూ సిరీస్ లో 1-1తో సమానంగా నిలవడంతో మూడో టెస్ట్ విజయంపై ఉత్కంఠ నెలకొంది. మూడో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. 6 పరుగుల స్కోరు వద్ద సిరాజ్ బౌలింగ్ లో పుజారాకు క్యాచ్ ఇచ్చి డేవిడ్ వార్నర్ ఔటయ్యాయి. ఆ తరువాత కొద్ది సేపటికే వర్షం కారణంగా ఆట నిలిచింది. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు వికెట్ నష్టానికి 21 పరుగులు. వర్షం కారణంగా ఆ సెషన్‌లో 7.1 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. ప్రస్తుతం విల్‌ పకోస్కీ, లబుషేన్‌ క్రీజులో ఉన్నారు. భోజన విరామ సమయానికి సైతం వర్షం కొనసాగడంతో సుమారు నాలుగు గంటల పాటు ఆటకు అంతరాయం ఏర్పడింది.

కొద్దిసేపటి క్రితమే వర్షం నిలిచిపోవడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించి తిరిగి మ్యాచ్‌ను ప్రారంభించారు. దీంతో 10 ఓవర్లకు ఆస్ట్రేలియా 27/1 స్కోర్‌ సాధించింది. అంతకుముందు టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నాలుగో ఓవర్‌లో డేవిడ్‌ వార్నర్‌(5)ను పెవిలియన్‌ పంపాడు.