టీచర్ల మద్దతు కోరిన శివకోటి యాదవ్

తెలంగాణ, జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శివకోటి యాదవ్ ప్రైవేట్ టీచర్ల మద్దతు కోరడం జరిగింది. శివకోటి యాదవ్ పనిచేస్తున్న నర్సంపేటలోని బాలాజీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్(బిట్స్)లోని నాతోటి సహచర ఉపాధ్యాయులను కలిసి జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలను తెలిపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించమని కోరడం, అలాగే వారు తప్పకుండా మా మద్దతు ఉంటుందని తెలపడం సంతోషనీయం. మీలో నుంచి ఒకడిగా బయటికి వచ్చి వ్యవస్థలో మార్పు కోసం ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళుతున్న. మీ అందరి శుభాశీస్సులు ఉండాలి. ఒక మంచిని బోధించి అది సమాజంలో ఆచరించబడాలన్న ఒక టీచర్ యొక్క శక్తి ప్రభావం అత్యంత గొప్పది. ఆ మంచే జనసేన పార్టీ. మీరు కూడా జనసేన పార్టీ గురించి 10 మందికి చెప్పి ఓటు వేయించండి. మనలో కొంతమంది టీచర్లకు సమస్యలు వస్తే వారికి అండగా నిలిచాను. అలాగే కరోనా సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడితే ప్రభుత్వం ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున రాస్తారోకో చేసి డిమాండ్ చేయడం జరిగింది. తద్వారా వెంటనే ప్రభుత్వం స్పందించి ఒక నెలకు సరిపడు బియ్యం, కొంత తక్షణ సాయం అందించడం జనసేన విజయం. ప్రైవేట్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తా, మీలో ఒకడిగా మీ అందరికీ ఏ సమస్య వచ్చిన అండగా ఉంటానని ప్రైవేట్ టీచర్ల మద్దతు కోరుతూ, వారితో జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జీ మేరుగు శివకోటి యాదవ్ తెలిపారు.