వరద బాధితుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు వచ్చిన కారణంగా అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా గ్రేటర్‌పరిధిలో 208 ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ వైద్యశిబిరాలలో వరద బాధితులతో పాటు నివాసాలు కోల్పోయి పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి ఈ ప్రత్యేక వైద్యశిబిరాల ద్వారా అన్ని రకాల వైద్యసేవలు అందించడంతో పాటు ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ సంవత్సరం వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలలేదు.గడిచిన ముడురోజులుగా భారీ వర్షాలు, వరదలతో అంటువ్యాధులు, ముఖ్యంగా నీటివల్ల వచ్చే టైఫాయిడ్‌, కలరా, డయేరియా, అతిసారంతో పాటు దోమలు కూడా విజృంభించే అవకాశముండడంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్న ట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.