SRH VS DC: టాస్ గెలిచిన ఢిల్లీ క్సాపిటల్స్

ఐపీఎల్ 2020 లో ఈ రోజు మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోవడంతో హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ రెండు జట్లు గత మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడిపోయాయి. అందువల్ల ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమే. ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న చివరి ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే హైదరాబాద్ ఈ మ్యాచ్ లో గెలవాలి… ప్లే ఆఫ్ లో బెర్త్ సంపాదించిన మెదటి జట్టుగా నిలవాలంటే కూడా ఢిల్లీ ఈ మ్యాచ్ లో విజయం సాధించాలి. ఈ మ్యాచ్ లో ఎవరి విజయం సాధిస్తారు అనేది చూడాలి.