శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన మీడియా సమావేశం

శ్రీకాళహస్తి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమం తిరుపతిలో ఈ నెల 21 ఆదివారం నాడు గి.ఆర్.ఆర్ కన్వెన్షన్ హాల్ నందు (తిరుపతి – బెంగళూరు హైవే, బాలాజీ డైరీ ఎదుట) నిర్వహించనున్న సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా మీడియా సమావేశం స్థానిక నివాస గృహం నందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి నేరుగా తీసుకుని వెళ్లి, తద్వారా ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలు తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యే దిశగా ఒక మంచి అవకాశం, సమస్య ఎదుర్కొంటున్న వారు నిర్భయంగా ముందుకు వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రధానంగా గ్రామాలలో మౌళిక వసతులు త్రాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ కాలువలు, ఇళ్ళ స్థలాలు, పెన్షన్లు, భూ కబ్జాలు, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో జరిగే అక్రమాలు, ఇసుక దోపిడీ, కాలుష్యం ఇతరత్రా ఏ సమస్య అయినా దీర్ఘ కాలంగా పరిష్కారం కానీ సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని రావచ్చని తెలిపారు. ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపారు. సమస్య ఉన్న వారు నిర్భయంగా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ కి తెలపవచ్చని, ప్రజల నుండి నేరుగా వినతులు పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి, నాయకులు చందు చౌదరి, గిరీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.