పాడేరులో జనసేనలో చేరికలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, జి.మాడుగుల మండలంలో గల వివిధ పంచాయతీలు, బీరం, నుర్మాతి, బోయితేలి, కుంతుర్ల పంచాయతీల నుంచి సుమారు 100 మంది ప్రజలు స్వచ్ఛందంగా జనసేన అధినేత సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలు నచ్చి జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, గౌరవ అధ్యక్షులు తెరవడా వెంకటరమణ, జనసేన నాయకులు తల్లే త్రిమూర్తుల యొక్క అద్వర్యంలో క్షేత్రస్థాయి జనసేనపార్టీ పర్యటనలో భాగంగా శుక్రవారం జిల్లా ప్రధాన కేంద్రంలో గల పాడేరు జనసేనపార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ అరకు పాడేరు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య చేతుల మీదుగా జనసేన పార్టీ కండువాలతో పార్టీలోకి ఆహ్వానించగా జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా డా.గంగులయ్య మాట్లాడుతూ మీరందరు జనసేన పార్టీలో చేరడం నిజంగా ఆనందంగా ఉందని, మార్పు మన ఆదివాసీ ప్రాంతంలో వేగంగా విస్తరిస్తోంది అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి, ప్రస్తుత రాక్ష సపాలన ఈ వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నాం గిరిజనులకు ఆయువు పట్టు,పేసా, జీవో నెం 3, చట్టం 1/70 వంటి చట్టాలకు తూట్లు పొడిచి నేడు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు కులాల మధ్య చిచ్చు పెడుతూ ఆదివాసీ అస్థిరతకు ఆలోచన చేస్తోందని ఇప్పటికైనా మన ఆదివాసీ ప్రజలు మార్పు కోరి జనసేనపార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మనం గెలిచి రాష్ట్ర రాజకీయ సమూల మార్పు కొరకు అధినేత పవన్ కళ్యాణ్ కి మొదటి తోడుగా నిలుద్దామని తెలిపారు. పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ మాట్లాడుతూ జనసేనాపార్టీలో రోజు చేరుతున్న నా ఆదివాసీ ప్రజానీకానికి నేను నమస్కరిస్తున్నాను. జనసేనలో చేరడమంటే మార్పు కొరకు శ్వాస ఉన్నంతవరకు పోరాడటం గత కొన్నాళ్లుగా విధ్వంసం, విశ్వాసఘాతుకం, నయవంచన వంటి వికృత పరిపాలనకు మీరంతా ముగింపు పలికి పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడవటం ప్రతి ఆదివాసీ తన ఆత్మ గౌరవం కోసం పోరాడటం వంటిదే నంటూ తెలిపారు. జి. మాడుగుల మండల అధ్యక్షులు మశాడి భీమన్న మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో, ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్ళాలని, ప్రజలలో చైతన్యం పరిజ్ఞానం కలిగించే అవసరం జనసైనికులకు ఉందని జనసేన పార్టీ బలోపేతానికి జనసైనికులు కృషి చేయాలని తెలిపారు. అలాగే జి.మాడుగుల మండల గౌరవ అధ్యక్షులు తెరవాడ వెంకటరమణ మాట్లాడుతూ జనసైనికులు గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు నిస్వార్థంగా కష్టపడి పని చేసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసే విధంగా కృషి చేయాలని కోరారుఈ కార్యక్రమంలో కుంతూర్ల, నుర్మాతీ, బీరము, బోయితెలి, అరగడపల్లి, నుర్మాతీ కొత్తూరు, మద్దిగరువు, అనర్బా, సల్మరంగి, తదితర గ్రామా బూలకు చెందిన సుమారు 100 మంది పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డా. వంపూరు గంగులయ్య అలాగే పాడేరు మండల అధ్యక్షులు నందొలి మురళీకృష్ణ, జి మాడుగుల మండల అధ్యక్షులు మశాడి. భీమన్న, పాడేరు మండల ఉపాధ్యక్షులు సాలెబు అశోక్, కిల్లో అశోక్ కుమార్, సి.హెచ్.అనిల్ కుమార్, పాంగి సూర్యారావు, వంతాల ఈశ్వర్ రాయుడు, తల్లే త్రిమూర్తులు, తల్లే కృష్ణమూర్తి, కొర్ర లక్ష్మణ రావు పాల్గొన్నారు. ఈ చేరికలో కృషి చేసినటువంటి పెద్దలు కొఠారి పండన్న, మదేలా సోమన్న, ఓలేసు, జాల్చ మోహన్, కిముడు నాగేశ్వరరావు, బట్ట అంగధరావులకు పాడేరు అరకు పార్లమెంట్ డా. వంపూరు గంగులయ్య పాడేరు జనసేనపార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.