చేనేత కళ కనుమరుగైపోతుంది: ఎం.హనుమాన్

విజయవాడ, దేశంలో వ్యవసాయం తర్వాత చేనేతరంగమే ఎక్కువ మందికి జీవనోపాధి చూపిస్తోంది. మనదేశంలోని కొన్ని వేల గ్రామాల్లో చేనేత మగ్గాలున్నాయి. వీరి ప్రతిభాపాటవాలు, నైపుణ్యమూ అగ్రరాజ్యాలను సైతం ఆకర్షిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాల్లోనూ మన చేనేత వస్త్రాలకు చక్కటి గిరాకీ ఉంది. అయినా, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు .ఈ వైసీపీ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించలేక పోతుంది. కనీసం చేనేత కార్మికులకు పని కూడా కల్పించాలని ప్రభుత్వం ఉంటే ఎంత? పోతే ఎంత ??? ఆకలి కేకల్లో చేనేత కార్మికులు అల్లాడుతున్నారు రోజంతా కుటుంబం కష్టపడిన రోజుకి 300 కూడా రావడం లేదు. అగ్గిపెట్టెలో ఒదిగేపోయే పట్టు చీరలను నేసే నైపుణ్యం ఉన్నా ఈరోజున నాలుగు మెతుకులకు నోచుకోని అభాగ్యులు వారు. కంటికి ఇంపైన రంగులతో, చూడముచ్చటైన వస్త్రాలను నేసే ఆ కుటుంబాలలో పసిపిల్లలు ఊగే ఉయ్యాలలు కనిపించవు. ఈ వైసీపీ అరాచక పాలన కొనసాగితే రానున్న రోజుల్లో ఈ చేనేత కలలను నైపుణ్యాలను వస్త్రాలను మ్యూజియంలో చూసుకోవడమే తప్ప సమాజంలో కనుమరుగైపోతుందని జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి ఎం.హనుమాని అన్నారు.