బోరుగడ్డ అనిల్ పై చర్యలు తీసుకోండి

  • ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను సమాజం నుండి వెలివేయాలి
  • సమాజానికి చీడ పురుగులాంటి అనిల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి
  • పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ పై తీవ్ర చర్యలు తీసుకోవాలి
  • జిల్లా ఎస్పీ అరీఫ్ హఫీజ్ కి ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ ఎస్సి విభాగ నేతలు

గుంటూరు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటూ వారి కుటుంబ సభ్యులపై తీవ్రమైన స్థాయిలో సభ్యసమాజం తలదించుకునే విధంగా సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా మాట్లాడిన రిపబ్లిక్ పార్టీ నాయకుడునని చెప్పుకునే బోరుగడ్డ అనిల్ పై చర్యలు తీసుకోవాలని, అలాగే సంఘ విద్రోహ శక్తిగా మారిన అనిల్ ని సమాజం నుంచి వెలివేసేలా కూడా తగు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఎస్సి విభాగ నేతలు కొండూరు కిషోర్ కుమార్, సోమి ఉదయ్ కుమార్ లు జిల్లా ఎస్పీ అరీఫ్ హఫీజ్ ని కలిసి ఫిర్యాదు చేశారు. శనివారం జనసేన పార్టీ నగర అధ్యక్షులు నెరేళ్ల సురేష్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నేరెడ్ల అమ్మి నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరిలతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో యస్పీ అరీఫ్ హఫీజ్ ని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడిన సీడీ లను ఎస్పీకి అందచేశారు. అనిల్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని యస్పీ అరీఫ్ హఫీజ్ తెలిపారు. ఈ సందర్భంగా కొండూరు కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖలను, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని వారి వ్యక్తిత్వ హణనానికి పాల్పడుతున్న అనిల్ పై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనిల్ జీవితం అంతా నేరాల మయం అని, తన కులాన్ని అడ్డం పెట్టుకొని ఎంతోమంది అమాయకుల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుడు అనిల్ అని మండిపడ్డారు. మాట్లాడితే ఎస్సి, ఎస్టీ కమీషన్ పేరు చెప్పి తన ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల జీవితాలతో ఆడుకోమని ఎస్సి, ఎస్టీ కమీషన్ చెప్పలేదని, అనిల్ చేస్తున్న దూరాగతాలపై, నేరచరిత్రపై త్వరలో ఎస్సి, ఎస్టీ కమీషన్ ను కలుస్తామని కిషోర్ తెలిపారు. రాష్ట్ర రెల్లి యువజన నాయకుడు సోమి ఉదయ్ మాట్లాడుతూ అనిల్ అనే నీచుడు పవన్ కళ్యాణ్ కాలిగోటికి కూడా పనికిరాడన్నారు. పవన్ కళ్యాణ్ పై ఇంకోసారి అవాకులు చవాకులు పేలితే నడిరోడ్డుపై గుడ్డలుప్పతీసి ఊరేగిస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ జోలికి తరువాత ముందు మా జనసైనికుల జోలికి రా చూసుకుందాం అని అనిల్ కి సోమి ఉదయ్ సవాల్ విసిరారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ గతంలోనూ అనిల్ ఎంతోమందిపై తీవ్రస్థాయిలో ఇదేవిధంగా దుర్బాషలాడాడని, ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో అంతరాలు వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కుల మతాల విచ్ఛిన్నానికి దోహదం చేసేలా వ్యాఖ్యానించిన అనిల్ పై బలమైన సెక్షన్లతో కేసు నమోదు చేయాలన్నారు. చిన్న చిన్న మెసేజ్ లు ఫార్వార్డ్ చేస్తేనే కేసులు పెడుతున్న సీఐడీ అధికారులకి అనిల్ చేస్తున్న దూరాగతాలు కనపడటం లేదా లేక కళ్ళుండి కబోదుల్లా వ్యవహరిస్తున్నారా అని సురేష్ ప్రశ్నించారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ అనిల్ మాట్లాడిన మాటలు విని అతన్ని కన్నందుకు వాళ్ళమ్మ, కట్టుకున్నందుకు తన భార్య, తన కడుపున పుట్టినందుకు పిల్లలు సిగ్గుపడుతున్నారన్నారు. ఒక్కసారి ఇతరుల కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తే వాళ్ళు కూడా వేల సార్లు అనిల్ కుటుంబ సభ్యుల్ని అదే విధంగా దూషిస్తారన్నారు. నీ వ్యాఖ్యలు చూసి నీ కుటుంబ సభ్యులే చీదరించుకుంటున్నారని, ఇలాంటి బ్రతుకు అవసరమా అని అనిల్ ని దుయ్యబట్టారు. సమాజంలో ఉండటానికి కూడా అర్హత లేని అనిల్ పై గతంలో ఉన్న నేర చరిత్ర దృష్ట్యా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆళ్ళ హరి కోరారు. పోలీస్ వ్యవస్థ పై తమకి పూర్తి నమ్మకం ఉందని, అనిల్ పై పోలీసులు త్వరలోనే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని ఆళ్ళ హరి అన్నారు. జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన వారిలో లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు అమ్మి నాయుడు, నగర ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర, నగర నాయకులు బండారు రవీంద్ర , మెహబూబ్ బాషా, బుడంపాడు కోటి, సాగర్, చేజేర్ల శివ, సుంకే శ్రీనివాసరావు, ఫణి శర్మ, కొనిదేటి కిషోర్, కొత్తకోట ప్రసాద్, గోపి, నవీన్, లాయర్ గోపి, పుల్లంశెట్టి ఉదయ్, గడ్డం అనిల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.