రోడ్డుప్రమాదానికి గురైన ఆంజనేయులుకు పత్తి చంద్రశేఖర్ ఆర్థిక సాయం

సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం: రోడ్డుప్రమాదానికి గురైన జనసేన పార్టీ మండల అధ్యక్షుడికి పుట్టపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ పత్తి చంద్రశేఖర్ 25000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసారు. ప్రమాదానికి గురైన ఆమడగురు మండల అధ్యక్షుడు ఆంజనేయులు కుటుంబసభ్యులతో పత్తి చంద్రశేఖర్ ఫోన్ లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి లు తెలుసుకుని. 25000 రూపాయలు ఆర్థిక సాయం డాక్టర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాబు చేతుల మీదగా పత్తి చంద్రశేఖర్ అందజేసారు. ఈ కార్యక్రమంలో కదిరి మండల అధ్యక్షుడు చిల్లా మహేష్ బాబు పాల్గొన్నారు.