సీసంగుంతల గ్రామంలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి ప్రచారం

నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం, సీసంగుంతల గ్రామంలో టిడిపి బిజెపి జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి తరపున సీసంగుంతల గ్రామ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులతో ప్రచారం అంగరంగ వైభవంగా జరిగింది. బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోడలు, మాజీ కేంద్ర రైల్వే మంత్రి, మాజీ కర్నూలు ఎంపీ, ప్రస్తుతం డోన్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తరపున, ఆయన సతీమణి డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సీసంగుంతల గ్రామంకి ఎన్నికల ప్రచార నిమిత్తంలో భాగంగా రావడం జరిగింది. కోట్ల సుజాతమ్మకి సీసంగుంతల గ్రామ ప్రజలతోపాటు, టిడిపి, బిజెపి నాయకులు ఘన స్వాగతం పలకడం జరిగింది. మొదటగా ఆంజనేయ స్వామి ఆశీస్సులు, మారెమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం ముఖ్య నాయకుల స్వగృహానికి వెళ్లి వారందరితో ఎన్నికల ప్రచార కార్యక్రమంకు సంబంధించి మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం ఎన్నికలు పూర్తి అయ్యేవరకు నిర్వహించాలని పేర్కొనడం జరిగింది. బిజెపి యువ నాయకులుగా ప్రస్తుత అధికార వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై కూటమి నాయకులుగా పనిచేస్తున్నందుకు కొట్టె మల్లికార్జునను ప్రశంసించడమే కాకుండా, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన కోట్ల సుజాతమ్మకు కొట్టె మల్లికార్జున ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి టిడిపి నాయకులు శివరామి రెడ్డి, కొట్టె రామకృష్ణారెడ్డి, లక్ష్మీకాంత్, అయ్యన్న, గోవిందు, బబ్లూ, రంగారెడ్డి, రంగస్వామి, పెద్దయ్య, వినోద్, కార్తీక్, ప్రదీప్ తో గ్రామస్తులు, ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టిడిపి బిజెపి జనసేన కూటమిదే. మరో 14 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో నుంచి అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తుందని బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీసంగుంతల గ్రామములో ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించిన టిడిపి బిజెపి జనసేన నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ సీసంగుంతల గ్రామానికి చెందిన ఒక బిడ్డగా, బిజెపి యువ నాయకులుగా మీ అందరికీ రుణపడి ఉంటానని భవిష్యత్తులో సీసంగుంతల గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడంతో పాటు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.