అడవినే ఐసోలేష‌న్‌ గా మార్చిన గ్రామస్థులు

కరోనా మహమ్మారి పల్లెలును కూడా వదిలిపెట్టడం లేదు. మొదటి వేవ్ పట్టణాలను , నగరాలను భయపెడితే..సెకండ్ వేవ్ మాత్రం గ్రామాలను కూడా వదిలిపెట్టకుండా తన ప్రతాపం చూపిస్తుంది. కరోనా కు చాలామంది గ్రామాల్లో నివచించేవారు కన్నుమూశారు. తాజాగా కొంతమంది గ్రామస్థులు కరోనా సోకడం తో అదే గ్రామంలో ఉంటె మిగతా వారికీ కరోనా వస్తుందేమో అని భయపడి అడివినే ఐసోలేష‌న్‌ గా మార్చిన ఘటన భూపాల‌ప‌ల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

తెలంగాణ‌లోని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని య‌త్నారం అనే అట‌విగ్రామంలో మూడు రోజుల వ్య‌వ‌ధిలో 34 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. త‌మ వ‌లన మిగ‌తా వారికి ఎక్క‌డ క‌రోనా సోకుతుందో అనే భ‌యంతో గ్రామంలోని ఏడు కుటుంబాల‌కు చెందిన 20 మంది క‌రోనా బాదితులు అడ‌వీని ఐసోలేష‌న్ కేంద్రంగా మార్చుకున్నారు. అడ‌విలోనే ఉంటూ అక్క‌డే వంట చేసుకుంటూ కాలం గ‌డుపుతున్నారు. పూర్తిగా కోలుకున్న త‌రువాత తిరిగి గ్రామంలోకి వెళ్తామ‌ని చెపుతున్నారు.