మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి: గురాన అయ్యలు

విజయనగరం: మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. మహాత్మా గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతులను పురష్కారించుకుని సోమవారం
జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం మహనీయులు ఎంతో కృషి చేశారని, వారిని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని, రాజ్యాంగాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే ప్రజా పాలన రావాల్సిందే అన్నారు. సిఎం జగన్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న
రాష్ట్రానికి జనసేన-టిడిపి కూటమితో విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు డి.రామచంద్రరాజు, మాతా గాయిత్రి, పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, పిడుగు సతీష్, అడబాల వేంకటేష్, ఏంటి రాజేష్, ఎమ్. పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కె.సాయి, సురేష్ కుమార్, హిమంత్ కుమార్, కోలగట్ల తేజ తదితరులు పాల్గొన్నారు.