ఆదోని జనసేన ఐటీ సమన్వయకర్త గొల్ల మహేష్ పై దాడి గర్హనీయం

ప్రతిపక్షంగా ప్రజా పక్షం వహిస్తూ జనసేన నాయకులు మాట్లాడితే అధికార వైసీపీవాళ్ళు అసహనంతో అప్రజాస్వామిక రీతిలో దాడులకు తెగబడటం వారి నైజాన్ని తెలియచేస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ పార్టీ ఐటీ సమన్వయకర్త శ్రీ గొల్ల మహేష్ పైనా, ఆయన తల్లితండ్రులపైనా వైసీపీ వాళ్ళు దాడి చేయడం గర్హనీయమన్నారు. శ్రీ మనోహర్ గారు ఫోన్ ద్వారా శ్రీ మహేష్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా నిలుస్తుందని, పార్టీ రాష్ట్ర ఐటీ సెల్ ఛైర్మన్ శ్రీ శ్రీనివాస్ మిరియాల సమన్వయం చేస్తారని తెలిపారు. ప్రశ్నించే తత్వాన్ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతలో పెంపొందించారని… యువత ధైర్యంగా అధికార పక్షం తీరుపై మాట్లాడుతుంటే తట్టుకోలేక దాడులకు దిగుతున్నారు అన్నారు.