“నా సేన కోసం.. నా వంతు”కు రూ. 2 లక్షల విరాళం

సిరిపురపు రమేష్ ని అభినందించిన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు
“నా సేన కోసం.. నా వంతు..” కార్యక్రమం కోసం రూ. 2 లక్షలు డీ.డీ. రూపంలో జనసేన పార్టీకి విరాళం అందజేసిన చోడవరం నియోజకవర్గం నాయకులు శ్రీ సిరిపురపు రమేష్ గారిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు ప్రత్యేకంగా అభినందించారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పోరాడుతున్న తీరు, పేద ప్రజలకు సహాయం అందజేస్తున్న విధానానికి ఆకర్షితులై జనసేన పార్టీకి అండగా నిలబడుతున్న ప్రతీ ఒక్కరి ప్రోత్సాహం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో జనసేన విజయం అనివార్యం అనిపిస్తోందని నాగబాబు గారు స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు, వీర మహిళ కృపా గారు, జనసేన నాయకులు శ్రీ నల్లం శ్రీనివాస్, చోడవరం జన సైనికులు బొబ్బిలి నాయుడు, కొల్లి గణేష్, సీతా గణేష్, పరమేష్ పాల్గొన్నారు.