అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల కుటుంబం

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, చక్రద్వారాబంధం గ్రామంలో కార్తీకమాసం సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ భవాని సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాఅన్నదాన కార్యక్రమం లో పాల్గొని భవాని సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో- ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి”. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, చక్రద్వారాబంధం గ్రామ జనసేన పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.