అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినాబత్తిని రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడ శశిభూషణ్, పొన్నలూరు మండల నాయకులు కాకాని ఆంజనేయులు, వీరమహిళలు పాల్గొని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి గురువారం మద్దతు తెలియజేశారు. అవసరమైతే అంగన్వాడీల వర్కర్స్ కోసం నిరాహార దీక్ష చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నామని జనసేన నాయకులు తెలియజేశారు.