అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన పితాని

అమలాపురం రూరల్, మండలం సాకుర్రు గ్రామంలో జనసైనికుడు బొలిశెట్టి శివకు చెందిన ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో అతని కుటుంబం రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వారిని పరామర్శించి, కుటుంబానికి సహాయంగా బట్టలు మరియు కొంత మొత్తంలో ఆర్థిక సహాయం అందించారు. వీరి వెంట బండారు వెంకన్నబాబు, ఆకుల గంగారావు, మేడిచర్ల ఆదిబాబు తదితరులు ఉన్నారు.