కొత్తపేట నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

కొత్తపేట నియోజకవర్గం: జనసేన – తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గం, ఆత్రేయపురం మండలం, బొబ్బర్లంక – ధవలేశ్వరం గ్రామాల మధ్య ఉన్న బ్యారేజ్ రహదారి దుస్థితిపై ఆదివారం టిడిపి, జనసేన పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్న రహదారులు మరమ్మత్తులకు నోచుకోలేదు. రహదారులు అన్నీ గుంతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. గ్రామాల్లో వేసిన రోడ్లు కూడా నాణ్యతలోపం కనిపిస్తుంది. సంవత్సర కాలం గడవక ముందే పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు హడావుడిగా రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించామని చెప్పడం, కొబ్బరి కాయలు కొట్టి శంకుస్థాపన చేసినట్టు ఓట్ల కోసం ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మరోటి కాదు అని జనసేన నియోజకవర్గ బండారు శ్రీనివాస్ దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వైసిపిని వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని, ప్రజలు చైతన్యవంతంగా ఉండాలని కోరారు. అదేవిధంగా టిడిపి నియోజకర్గ ఇంఛార్జి బండారు సత్యానందం కూడా ప్రభుత్వా విధానాలుపైన ఖండిస్తూ స్థానిక శాసన సభ్యులుని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి తాళ్ల డేవిడ్, సంగీత సుభాష్, బొక్కా అది నారాయణ, మండల అధ్యక్షులు, నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొనగా టిడిపి నుండి నియోజకవర్గం శ్రేణులు పాల్గొన్నారు.