అగ్నిప్రమాద బాధితురాలికి ఆర్ధికసాయం చేసిన అనపర్తి జనసేన

అనపర్తి నియోజకవర్గం: పెదపూడి మండలం మామిడాడ గ్రామంలో అంబేద్కర్ కాలనీ ఎస్సీపేటలో మంగళవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 7నెలల గర్భిణి స్త్రీ మరియు 70సంవత్సరాల వృద్ధురాలి కుటుంబం ఒక చిన్న గుడిసెలో అగ్నిప్రమాదంలో చిక్కుకోగా దురదృష్టవశాత్తు వృద్ధురాలు మరణించి పూర్తిగా మంటల్లో కాలిపోవడం జరిగింది. పూర్తిగా దగ్ధం అయిన ఇల్లు, కట్టుబట్టలు మాత్రమే మిగిలి ఉన్న ఆ కుటుంబానికి విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వారిని పరామర్శించి అనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త రావడ నాగు రూపాయలు 10,000/- ఆర్థికసాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడాడ గ్రామ జనసేన అధ్యక్షులు కళ్యాణ్, అశోక్, సుంకర బుజ్జి వడ్లమూరి గోవిందరాజులు, కొండబాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.