ఆదివాసి గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం

జి.మాడుగుల మండలం, నుర్మతి పంచాయితీ, చిన వాకపల్లి గ్రామంలో జనసేన పజాచైతన్య కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వంపురు గంగులయ్య ప్రసంగిస్తూ… ఆదివాసీ గ్రామాల్లో నేటికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు, పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించదు. ఈ నియోజకవర్గాన్ని పాలిస్తున్న ప్రజాప్రతినిధుల్లో జీవో నెం3 కోసం ఎటువంటి స్పందన ఉండదు, జీవో నెం3 ఆదివాసీ నిరుద్యోగులకు ఆయువు పట్టు అనే విషయం విస్మరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను పి.ఆర్.సి అంశం పక్కనెట్టి ఇప్పుడు కొత్త జిల్లాల అంశం తెరమీదకు తెచ్చింది ఫలితంగా ప్రజా సమస్యలు తెలివిగా తప్పుదోవ పట్టించింది. ఇటువంటి నీతిమాలిన రాజకీయలకి కొమ్ముకాస్తున్న ప్రజా ప్రతినిధులు 5వ షెడ్యూల్ ప్రాంత ప్రజల జీవన హక్కుని కాల రాస్తోంది. దీనిని ప్రజలు తీవ్ర స్వరంతో వ్యతిరేకించాల్సిన అవసరముంది. సంవత్సరంకి ఒక డి.ఎస్.సి అన్నారు ఇవ్వాళ నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపారు అంటూ డా.గంగులయ్య వైకాపా పాలన వ్యవస్థని తీవ్రంగా దుయ్యబట్టారు. స్వతహాగా జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై టీడీపీకి కంచు కోట లాంటి చినవాకపల్లి గ్రామ ప్రజలు మూకుమ్మడిగా ప్రతి ఒక్కరు మహిళలతో సహా డా.వంపురు గంగులయ్య ఆధ్వర్యంలో జనసేన పార్టీ కండువా కప్పుకుని ఇప్పటినుంచి జనసేన పార్టీ బలోపేతానికి మావంతు కృషి చేస్తామని శపథం చేశారు. ఈ కార్యక్రమం ఇంతలా విజయవంతం కావడానికి కృషి చేసిన జి.మాడుగుల జనసేన మండల స్థాయి నాయకులు మసాడి భీమన్న(ప్రశాంత్) జనసేన మండల అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు తెరవడా రమణ ప్రధాన కార్యదర్శి గొంది మురళి, యూత్ అధ్యక్షులు, షేక్ మస్తాన్, జనసేన ట్రెజరీ విభాగం అధ్యక్షులు తంగుల రమేష్ కుమార్, జనసేన యూత్ ఉపాధ్యక్షులు మసాడి సింహాచలం, గౌరవ ఉపాధ్యక్షులు మత్యరస పోతురాస గంగ ప్రసాద్, చిన వాకపల్లి గ్రామ యూత్ కుసంగి వంశీకృష్ణ, వెంబరి నాగరాజు, తాల్లే మూర్తి బూటరీ శివకృష్ణ, బూటరీ ఈశ్వరరావు, వెంబరి పెద్ద మత్యలింగం మరియు వాకపల్లి పెద్దలు కృషి ఆమోఘమని చెప్పాలి.