అంగన్ వాడిల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం

  • జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర

రైల్వే కోడూరు నియోజకవర్గం: రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ వెట్టి చాకిరి, పనియంత్రాలు ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా దానికి ప్రత్యక్ష నిదర్శనం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు, 26000 రూపాయల వేతనం, ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడం లాంటి న్యాయ బద్దమైన డిమాండ్లు పరిష్కరించ కుండా వాళ్ళ జీవితాలతో ప్రభుత్వం చలగాటం ఆడుతోందని విమర్శించారు. ప్రస్తుత ధరలలో 1000 రూపాయలకు రెంటుకు రూము ఎక్కడ దొరుకుతుందని, ఒక నెలలో 4 లేదా 5 మీటింగులు పెడతారు.. మళ్లీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వచ్చినా మీటింగులో కూర్చోబెడతారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటినుండి టి.ఎ బిల్లులు ఇంతవరకు ఇవ్వలేదు. ఆఖరికి గవర్నమెంట్ కు సబ్మిట్ చేసే రికార్డ్ బుక్స్ కూడా వాళ్ళే కొనుక్కోవడం శోచనీయమన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వేధింపులు, మెమోలు ఈ రోజు ఒక్క కోడూరు సెక్టార్ లోనే 5మందికి మెమోలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంగన్వాడీ టీచర్ల, ఆయాల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే జనసేన పార్టీ వారికి అండగా ఉద్యమంలో పాల్గొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జోగినేని మణి, పగడాల వెంకటేష్, ముద్దపోలు రామసుబ్బయ్య, ఆలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.