టమాటా పంట వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

అనంతపురం, టమోటా పంటకు గిట్టుబాటు ధర లేకుండా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అందులో ప్రధానంగా అనంతపురం టమోటా మార్కెట్ మండి వద్ద లక్షల టన్నుల టమోటా వృధాగా ఉన్న పరిస్థితి మీడియా ద్వారా వివిధ రైతులు రైతు సంఘాల ద్వారా ఇప్పటికే మనందరికీ తెలుసు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది కలెక్టర్లు మారిన అనంతపురం జిల్లా మార్కెట్ యార్డ్ మండి పక్కన ప్రతి సంవత్సరంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సారి టమోటా గుట్టలు గుట్టలుగా కనపడడం పరిపాటిగా మారింది అనంతపురం టమోటా మండి నుండి దేశ నలమూలకు ఎగుమతి చేసే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలుగా బుట్టలు గుట్టలుగా పారవేసిన టమోటాలను చూసి అక్కడున్న రైతులని తో మాట్లాడి శాశ్వత పరిష్కారం. చేయాలంటే ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అట్లు చేయని పక్షాన జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే జాము ఊరగాయ టమోటా జాబు టమోటా ఊరగాయ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని రైతులకు తెలియజేయడం జరిగిందని బుక్కరాయసముద్రం కమిటీ సభ్యుడు అరటి తాహిర్ ఈ సందర్భంగా తెలిపారు.