రాజాం జనసేన నాయకులు ఎన్ని రాజు బహిరంగలేఖ

రాజాం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్ని రాజు ఈ (ప్రభుత్వానికి) వైసీపీ పార్టీ కి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇటీవల కుప్పంలో కుప్పంలో జరిగిన వైయస్సార్ చేయూత కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గానికి ప్రజలచే ఎన్నుకోబడిని ఎమ్మెల్సీ భరత్ అడక్కుండానే వరాల జల్లు కురిపించారు. (యాదగిరి పల్లి రిజర్వాయరుకు 250 కోట్లు, కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్లు, మిగతా నాలుగు మండలాలకు 100 కోట్లు) నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు మీరు. కానీ మా రాజాం నియోజకవర్గ (ఎస్సి) ప్రజలు ఏం పాపం చేసుకున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజాం – పాలకొండ రోడ్డు చాలా దారుణంగా ఉందని, కనీసం ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని, పట్టించుకునే నాధుడే లేడు. గతం నుంచి కూడా ఈ రాజాం (ఎస్సి) నియోజవర్గ ప్రజలు, పాలకొండ(ఎస్టి) నియోజవర్గ ప్రజలు వైయస్సార్సీపి పార్టీకి పట్టంకట్టారు. కానీ విశ్వాసం లేకుండా ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. రోడ్డు సమస్య తరతరాలుగా చాలా అధ్వానంగా ఉంది, ఈ రోడ్డు ప్రయాణం చేసి ఎంతో మంది ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురై, క్షతగాత్రులు, తన ప్రాణాలు కూడా కోల్పోయారు. మీకు పులివెందుల కుప్పం నియోజకవర్గం తప్ప రాష్ట్రంలో మరి ఏ నియోజవర్గం కనిపించట్లేదు, రెండుసార్లు ఈ రాజాం నియోజక ప్రజలు వైసిపి పార్టీని గెలిపించిన ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు, అదేవిధంగా వంగర మండలం లో మడ్డువలస రిజర్వాయర్ యొక్క గేట్లు కూడా పూర్తిస్థాయిలో పని చేయట్లేదు కేవలం రెండు గేట్లు మాత్రమే పనిచేస్తున్నాయి, అనుకోకుండా తుఫాన్లు గాని సంభవిస్తే ఈ రిజర్వాయర్ ముంపు ప్రాంతాలైన వంగర మండలంలో సగానికిపైగా గ్రామాలు వరదల్లో చిక్కుకున్న ప్రమాదం ఉంది, అలా జరిగితే తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా గమనించడం లేదు. ఇంతవరకు మీ ప్రభుత్వం వచ్చి రాజాం నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారు బహిరంగ చర్చకు సిద్ధమని, దమ్ముంటే శ్వేతపత్రాన్ని విడుదల చేయమని ఈ కార్యక్రమంలో రాజాం జనసేన నాయకులు ఎన్ని రాజు వైసిపి పార్టీకి సవాలు చేశారు.