రైతులను కులాల వారిగా విభజించిన ప్రభుత్వం మీదే: వాసగిరి మణికంఠ

గుంతకల్, సిబిఐ దత్తపుత్రుడా జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి సాయం అందుకున్నవారు కౌలు రైతులు కాదని చెప్పగలరా? ఆత్మహత్యలు చేసుకున్నది కౌలు కి వ్యవసాయం చేసి అప్పులపాలైన రైతులు పోలీస్ రికార్డుల్లో వివరాలు చూపిస్తాం. ఓపెన్ సవాల్ కు జనసేన సిద్ధంగా ఉన్నాం రండి మరి అని వాసగిరి మణికంఠ వ్యాఖ్యానించారు. సిబిఐ దత్తపుత్రుడికి ఆత్మ హత్యలు చేసుకున్న కౌలు రైతులు, వారి కుటుంబాలు పవన్ కళ్యాణ్ వచ్చి ఆర్థిక సాయం అందిచే దాకా మీకు కనబడలేదా. మాట తప్పం మడమ తిప్పం అని చెప్పుకునే జైలు రెడ్డి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

💥ఎస్సి, ఎస్టి మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న పెన్షన్ ఎక్కడ?
💥సిపిఎస్ రద్దు పరిస్థితి ఏంటి?
💥కార్పొరేష న్ లోన్స్ ఎక్కడ?
💥కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులేషన్ ఎక్కడ?
💥జాబ్ క్యాలెండర్ ఎక్కడా ?
💥కరెంటు చార్జీలు పూర్తిగా ఎప్పడు తగ్గిస్తారు..?
💥మద్యపాన నిషేధం ఎప్పటి నుంచి అమలు
💥పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది
💥రాష్ట్రానికి తెస్తానన్న మూడు రాజధానులు ఎక్కడ?
💥ఉచితంగా ఇస్తానన్న విద్యుత్ వ్యవసాయ మోటర్లుకు మీటర్లు ఎందుకు?
💥పల్లెల కనెక్టివిటీ రోడ్లు ఎప్పుడు బాగు చేస్తారు?
💥అధికారంలో లేకున్నా ప్రజల పక్షాన నిలబడి వారి సంక్షేమానికి పాటుపడే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేనేలేదని అన్నారు.