2024లో కడప నుంచి జనసేన జెండా ఎగరడం పక్కా!!

  • రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ కుప్పల జ్యోతి

అనంతపురం: రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ కుప్పల జ్యోతి గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. “వారాహి” అంటే ఏంటో తెలియని నీవు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి అంటే సిగ్గుచేటుగా ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన ఆంధ్ర రాష్ట్రానికి మేలేంటో నేను చెప్తా విను సంక్షేమ పథకాలు అంటూ ఎస్సీ ఎస్టీ బీసీల నిధులు పక్కదారి పట్టించడం. అమ్మ ఒడి అంటూ నాన్న జోబి ఖాళీ చేయడం. ఇకపోతే నువ్వు వెలుగు పెట్టింది ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి ఏంటో మనం తిరిగి చూసినట్టయితే శూన్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పట్టిన దరిద్రం అది నువ్వే. కుప్పాల జ్యోతి ప్రశ్నిస్తూ.. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని భూములు కబ్జా చేశాఓ లెక్క లేదు. కానీ నువ్వు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారిని మాత్రం విమర్శించే స్థాయినిది కాదు. నీ మనస్సాక్షికి నువ్వు ఏంటో నీకు తెలుసు బాబాయ్ హత్య కేసులో నీ పాత్ర ఏంటో నీకు తెలుసు. చంచల్ గూడా జైలు గోడలకు తెలుసు మనం ఎంత నిజాయితీపరులము జగన్మోహన్ రెడ్డి అని నువ్వు కూడా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ పై మాట్లాడతావా.. పవన్ కళ్యాణ్ అంటే ప్యాకేజి స్టార్ అని అంటున్నావు కదా మా నాయకుడు పవన్ కళ్యాణ్ కి అటువంటి దుస్థితి ఏనాడు లేదు ఒక్క రోజుకి ఆయనకి రెండు కోట్ల రూపాయలు వస్తే నిత్యం ప్రజలకు ఏమి చేయాలని కౌలు రైతుల కోసం నిలబడే ఎంతో తన సొంత డబ్బును ప్రజల కోసం వీక్షించిన వ్యక్తి నా అన్నయ్య పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తిపై ఈరోజు నువ్వు ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడు అంటున్నావు కదా.. మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆరోజు మీ ఆస్తులు వివరాలు ఎంత?.. ఈరోజు మీ ఆస్తులు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా.. కడప జిల్లాలో ప్రతి గడపకు మీయొక్క ఫ్యామిలీ గురించి తెలుసు రేపు 2024లో గట్టిగా నీకు నీ సొంత కడప జిల్లా ప్రజలే బుద్ధి చెప్తారు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఇంకోసారి పవన్ కళ్యాణ్ అన్నయ్యపై ఏవైనా మాట్లాడాలి అంటే ఆచితూచి మాట్లాడు. ఇకపోతే నేను మతాన్ని తప్పు పట్టను కానీ నువ్వు వేరే మతంలో దిగి మన హిందూ దేవతలను దేవతామూర్తుల పేర్లను మరిచావా లేదంటే మీరు రెడ్డి లేకుంటే దొడ్డ అనుకుంటున్నావా..?. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అన్నయ్య వారాహి యాత్రపై బుడద ఎలా చల్లాలో తెలియక అమ్మ ఒడి అని సాకు పెట్టుకొని బటన్ నొక్కుతానని అన్నయ్య ఉపయోగించే వారాహి వాహనంపై నీ వాక్యాలు చాలా హాస్యాస్పదం. ఎందుకంటే వారాహి అనే ఒక దైవం ఉంది. అని కూడా తెలీదు అంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవమానకరం నీ ఎలక్షన్ కాన్వాయ్ లో మాత్రం నీకు హిందూ దేవతలే కాదు వాళ్ళ పురోహితుల పేర్లు కూడా గుర్తొస్తాయి. మల్ల నువ్వు నేను ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడిని హిందూ దేవాలయాలపై అపారమైన ప్రేమ ఉందని నీ కల్లబొల్లి మాటలు ఇకనైనా ఆపు. ఇకపోతే నీ మంత్రులు నీకు తగినట్టే ఉన్నారు. అర్థ తెలివితేటలు తప్ప ఒక్కడికి నాలెడ్జ్ లేదు ఎప్పుడు పవన్ కళ్యాణ్ పై పడి ఏడవడం తప్పితే ప్రజలకు ఏం చేశారు అనేది ఒకరికి దాఖలాల్ కూడా ఉండదు. ఒకటి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో 2024లో నువ్వు గెలిచినా కడప నుంచి జనసేన జెండా ఎగరడం పక్కా!. నువ్వు చెప్పుకుంటావు కదా కడప నాది అని అదే కడప ఆడబిడ్డగా చెప్తున్నా వైయస్సార్సీపీ అనే కోటను ప్రజలు తప్పకుండా బద్దలు కొట్టి జనసేన జెండా నాటుతారని గుర్తుపెట్టుకో అని కుప్పల జ్యోతి హెచ్చరించారు.