రోడ్ల సమస్యలపై గళమెత్తిన జనసేన

రాష్ట్రవ్యాప్తంగా గుంతల మయమైన రహదారుల సమస్యలపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిసే విధంగా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ కార్యక్రమాన్ని చేపట్టింది. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హేష్ ట్యాగ్ తో రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లపై ఫోటోలు తీసి సోషల్ మీడియాలలో వాటిని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పోస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా జనసేన పార్టీ నాయకులు భాస్కర్ ఆదేశాల మేరకు ఆదివారం అవుకు మండలం రామాపురం గ్రామంలో అవుకు మరియు కొలిమిగుండ్ల మండలాల నాయకులు అజిత్ రెడ్డి జనార్ధన్ పెద్దయ్య పృథ్వి కుమార్ ప్రతాప్ ఓబులేసు తదితరుల ఆధ్వర్యంలో గుంతల మయమైన రామాపురం రోడ్డు పైన నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్లను జూలై 15 నాటికి ఎటువంటి గుంతలు లేకుండా చేస్తానని చెప్పారు కానీ ఎక్కడ కూడా కార్యరూపం దాల్చినట్టు అనిపించడం లేదని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్లు గుంతల మయమై బైక్ పై వెళ్లే వాహనదారులకు ప్రమాదాలు జరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను పూర్తి చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్లపై జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ రోడ్లపై బయటాయించి నిరసన తెలియజేస్తామని చెప్పారు. ప్రధాన రహదారులకు రోడ్లు వేస్తూ పల్లెల్లో గ్రామాలకు వెళ్లే రహదారులు అద్వానంగా అలాగే ఉన్నాయని వాటిని అసలు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పల్లెలకు కూడా పూర్తిస్థాయిలో రహదారులు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు బాబా ఫక్రుద్దీన్ కార్తీక్ సందీప్ ప్రవీణ్ చెన్నయ్య చిన్న తదితరులు పాల్గొన్నారు.