బండ్ల వీధి వరకు రక్షణ గోడ కల్పించాలని జనసేన డిమాండ్

ఉమ్మడి కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం వై.కోట గ్రామం నల్లంశెట్టి వీధిలోగల రోడ్డు అలాగే బ్రిడ్జి దగ్గర నుంచి బండ్ల వీధి వరకు రక్షణ గోడ కల్పించాలి. వర్షాకాలం వస్తే చెరువు నుండి ఆ నీరు మొత్తం నల్లంశెట్టి వీధి లోని కొన్ని ఇల్లు మీద నుంచి బండ్ల వాళ్ళ ఇళ్ల మీదుగా నీరు ప్రవాహం ఉంది దాదాపు 150 కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే రోడ్లో మా గ్రామంలోని దేవుని ఊరేగింపులు కూడా జరుగుతూనే ఉంటుంది మా తాతలు ముత్తాతల కాలం నాటి నుంచి ఈరోజు చేస్తాం, రేపు చేస్తామని మాటలు చెబుతూనే వస్తున్నారు కానీ ఎలాంటి అభివృద్ధి చెందడం లేదు. దయచేసి మా స్థానిక ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు గుర్తించి కనీసం ఈ సంవత్సరమైనా ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తారని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫునుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొండేటి మనోజ్ కుమార్, నల్లంశెట్టి నరసింహ, బాబు, గణేష్, మహేష్, కొండేటి భాస్కర్, కుమార్, సురేష్, పెంచలయ్య, రూతేష్ తదితరులు పాల్గొన్నారు.