క్షతగాత్రులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన జనసైనికులు

సీతంపేట మండలం, వజ్జాయి గూడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వ్యాన్ బోల్తా పడి గిరిజనులకు తీవ్ర గాయాలవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పాలకొండ జనసేనపార్టీ జనసైనికులు ప్రశాంత్ పోరెడ్డీ, రమేష్ పొట్నురు అనిల్ జామి, హేమంత్, లోకేష్, ఉమా తోటి జనసైనికులతో కలిసి ఏరియా హాస్పిటల్ పాలకొండకి వెళ్లి క్షత గాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లును కోరారు. వజ్జాయి గూడ గ్రామం నుండి గులుమూరు గ్రామానికికు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వెళ్తూ మార్గం మధ్యలో వ్యాన్ బోల్తా పడి 42 మంది కి తీవ్ర గాయాలయ్యాయి.(ఒకరు మరణించారు. సవర.మల్లమ్మ వ్/ఒ సుంబురు) క్షతగాత్రులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని డ్యూటీలో ఉన్న వైద్య నిపుణులను వారి ఆరోగ్య బాగోగులు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సంఘటనను పార్టీ పెద్దలు దగ్గరకు తీసుకు వెళ్తామని వారికి జనసేన పార్టీ తరఫున భరోసా ఇవ్వడం జరిగింది.