డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కి వినతిపత్రం సమర్పించిన డా. యుగంధర్ పొన్న

  • సంఘమిత్రను పునర్నియమించండి
  • రాజశేఖర్ కుటుంబాన్ని ఆదుకోండి
  • బాబు కుటుంబానికి సహాయం చేయండి

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ కార్వేటినగరం మండలం కొట్టార్వేడు గ్రామపంచాయతీలో 19 సంవత్సరాలుగా సంఘమిత్రగా పనిచేసిన జోసెఫ్ ను అక్రమంగా, దురుద్దేశ పూర్వకంగా ఉద్యోగం నుండి తొలగించారని, అతనిని తిరిగి సంఘమిత్రగా నియమించి బిపి, గుండె సంబంధమైన, షుగర్ తో బాధపడుతున్న జోసెఫ్ కి న్యాయం చేయాలనీ కోరారు. ఇదే గ్రామ నివాసి రాజశేఖర్ 2021 వ సంవత్సరంలో పాముకాటుతో మరణిస్తే ప్రభుత్వం నుండి రావలసిన భీమా ఇంతవరకు మంజూరు కాలేదని, ఈ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఇదే గ్రామానికి చెందిన బాబు అతని భార్య వేద ఇరువురు అనారోగ్యంతో మరణించారని, సహజ మరణానికి రావలసిన ప్రభుత్వ ఆర్థిక సహాయం ఇంతవరకు అందలేదని, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు బుజ్జి, ప్రధాన కార్యదర్శి దేవేంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ ఉన్నారు.