వేమల శ్రీనివాస్ కుటుంబంతో ఫోన్లో మాట్లాడిన నాదెండ్ల మనోహర్

ప్రైవేటు వాహనంలో తిరుమల వెళ్తున్న ఓ కుటుంబాన్ని రాత్రి పూట నడిరోడ్డుపై ఉంచేసి ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఆ వాహనాన్ని ఆర్టీఏ అధికారులు తీసుకువెళ్లడం దుర్మార్గపు చర్య అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. బుధవారం రాత్రి ఒంగోలు నగరంలో ఆర్టీఏ అధికారులు వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్ కుటుంబాన్ని ఇక్కట్లకు గురయ్యేలా ప్రవర్తించడాన్ని ఖండించారు. వేమల శ్రీనివాస్ కుటుంబంతో.. నాదెండ్ల మనోహర్ గురువారం ఉదయం ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఈ సందర్భంగా వేమల శ్రీనివాస్ కుటుంబం తమకు ఎదురైన ఇబ్బందులను తెలియచేస్తూ తిరుమలకు వెళ్తున్నాం.. పిల్లలు, మహిళలు ఉన్నారు అని చెప్పినా వినలేదు అని వాపోయారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టడం ఏమిటని ప్రశ్నిస్తూ… ఇదో కొత్త తరహా పాలనలా ఉందని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.