దొంగ ఓట్లకు తెరలేపిన అధికార వైస్సార్సీపీ పార్టీ

  • ఓటమి భయంతో నీచ రాజకీయాలకు తెరలేపిన వైస్సార్సీపీ

రాజానగరం నియోజకవర్గంలో సుమారు 20 వేల దొంగ ఓట్లు ఉన్నాయని టిడిపి, బిజెపి, జనసేన కూటిమి అభ్యర్ధి బత్తుల బలరామకృష్ణ ఆరోపించారు. ఇది రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయ పోరాటం చేస్తామన్నారు. దీనిపై ఆయన రాజానగరం తహశీల్దార్ షేక్ అబ్దుల్ రెహమాన్ కు దొంగ ఓట్లు వివరాలతో వినతిపత్రం అందజేశారు. అనంతరం కూటమి అభ్యర్ధి బత్తుల బలరామకృష్ణ గారు విలేకర్లతో మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఇంటి నెంబర్ లేకుండా 2500 ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు ఓట్లుగా ఉన్నవి సుమారు ఐదు వేలు, భార్యాభర్త ఉంటున్న ఇంటిలో రెండు ఓట్ల బదులుగా పది దొంగ ఓట్లుగా నమెదు జరిగాయన్నారు. రాజానగరం సమీపంలో సూర్యారావుపేటలో ఒకే ఇంటి నెంబర్ తో 144 ఓట్ల నమోదు చేశారన్నారు. వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, రెవెన్యూ అధికారులను భయపెట్టి అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన – తెలుగుదేశం – బిజెపి పార్టీల నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.