సిఎం ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలని విద్యార్థుల డిమాండ్

ఇచ్చాపురం నియోజకవర్గం, కవిటి మండలంలో బెంతో ఒరియా గిరిజన కులస్తుల రిలే నిరాహార దీక్ష 41 వ రోజుకు చేరాయి. వడ్డీ జల్లిపుట్టుగ గ్రామ విధ్యార్ధులు, పెద్దలు దీక్షలో పాల్గొన్నారు. దీక్ష శిబిరంలో విద్యార్థులు మాట్లాడుతూ తోటి విద్యార్థులతో పోటీపడి చదువుతు అత్యధిక మార్కులు వస్తున్నప్పటికీ ఉన్నత చదువులు చదవాలంటే కుల ధృవీకరణ పత్రాలు లేనందువల్ల ఎటువంటి ప్రభుత్వ పథకాలకు నోచుకోక ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవన, వసతి దీవెన రానందువల్ల కుటుంబ పరిస్థితి ఆర్థికంగా వెనుకబడుట వలన మధ్యలో చదువు ఆపివేయడం జరుగుతుంది. రెవెన్యూశఖ అధికారులు తప్పుచేస్తే తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయడం మానేసి మా నేటివిటీ కూడా నిలిపివేయడం ఈ చర్య ప్రజాస్వామ్యంలో దారుణం అన్నారు. మధ్యలో మా యొక్క కుల ధ్రువీకరణ పత్రాలు అకారణంగా ఆపివేయడం పట్ల మా భవిషత్ గందరగోళంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తపరిచారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చి ఇప్పటివరకు కుల ధ్రువీకరణ పత్రాలు పునరుద్ధరణ చేయలేదు అని మండిపడ్డాడు. కొత్తగా అడగట్లేదు భారత రాజ్యాంగంలో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మా తాతలు, తండ్రులు గిరిజనులుగ కుల ధ్రువపత్రాలు 2003 వరకు పొంది ఉన్నారు. రాజ్యాంగంలో నిజమైన గిరిజనులుగా క్రమ సంఖ్య 17లో యస్టీలుగా స్పష్టంగా ఉందని కేవలం ఎన్నికల సమయంలో తమకు యస్టీలుగా గుర్తించడం సబబు కాదని ప్రశ్నించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో గల 25వేల ఓటర్లను రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసమే నిరుపేదలైన మాకు అవసరానికి ఓటర్లుగా చూడటము విద్యార్థుల బంగారుకలల బతుకులలో బలి అవుతున్నారని వాపోయారు. రాజకీయ ప్రయోజనాల నాయకుల ప్రోత్సాహంతో లబ్దికై వాబా యోగేశ్వరరావు గిరిజన ఆదివాసులును రెచ్చగొట్టి బెంతో ఒరియా గిరిజన న్యాయ పోరాటానికి నిరాధార ఆరోపణ చేయడం విషయ పరిజ్ఞానం లేని పశుసంవర్ధక మంత్రి వెళ్లి సంఘీభావం తెలపడం వెనుక రాజకీయ కుట్ర ఉందని స్వస్టం చేశారు. వన్మెన్ కమిషన్ పేరిట ప్రతీసారి ప్రతీ ప్రభుత్వం కాలయాపన చేయడం తప్ప తమకు కులగుర్తింపు లేక అవస్థలకు గురి అవుతున్నాము అని విద్యార్థులు వెల్లుబుచ్చరు. వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మూడు దశాబ్దాలు వేచి చూసాము ఇకపై న్యాయం జరగకపోతే పోరాటం ఉద్రిక్తం చేపడతాం అని ప్రభుత్వానికి హెచ్చరించారు. విద్యార్థులు, పెద్దలు మోహన్ సాహు, బృందావన్ సాహు, వేదవర బిసాయి, జయసేన్ బిసాయి, ముకుందరావు దలై, భిమ్మో సాహు, ప్రభ బిసాయి, మేఘనాత్ బిసాయి, దుదిస్టి మజ్జి, గోపి బిసాయి, కృష్ణ దలై, ప్రేమ్ దలై, రాజేష్ బిసాయి తదితరులు పాల్గొన్నారు.