గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం

అంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరం. విద్యాధికుడైన ఆయన ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించారు.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డి కి, కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.