రైతుల సంక్షేమం మరచిన వైసీపీ ప్రభుత్వం- పల్లేపోరులో బొలిశెట్టి

మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం పెంటపాడు మండలం బి. కొండెపాడు గ్రామంలో పల్లెపోరులో శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో కౌవులు రైతుల జీవనం దుర్భరంగా ఉందన్నారు. వారి కష్టాల్ని గుర్తించలేని ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం అన్నారు. రైతులకి ఇవ్వల్సిన సబ్సిడీ లోన్లను ఇవ్వలేని ఈ ప్రభుత్వానికి రైతు బిడ్డలు బుద్ది చెప్తారన్నారు. కౌలు రైతులకు ముప్పే కోట్ల రూపయలు పైన సొంత డబ్బును పంచిన ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రైతులకు మౌలిక సదుపాయాలు అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కాపు యువతను ధర్నాల పేరుతో రెచ్చగొట్టి ఉగ్రవాదుల తయారు చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో టి డి ఆర్ బాండ్ల పేరుతో వందల కోట్ల దోచుకున్న నువ్వు పవన్ కళ్యాణ్ ని విమర్శించే అర్హత కొట్టు సత్యనారాయణకు లేదన్నారు. ఎన్నికల కమిషన్ కి మీ అవినీతిపై ఫిర్యాదు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నువ్వు అవినీతి చేయకపోతే ఏదైనా దేవుడి గుడిలో ప్రమాణం చేయడానికి రావాలని సవాల్ విసిరారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకొని ప్రచారం చేయడం నిజం కాదా అని ఆరోజు వచ్చిన ఓట్లు కళ్యాణ్ బిక్ష పెట్టింది అని అన్నారు. పవన్ కళ్యాణ్ ఫోటో కోసం హైదరాబాదులో పాకులాడిన నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, స్థానిక నాయకులు మండవల్లి మనీచైతన్య, అంబాటి రామచంద్రరావు, చిట్టులూరి దుర్గాప్రసాద్, పిల్లి బుల్లేశ్వర్రావు, పెరుమాళ్ళ సతీష్, గోదే నాగ, బొక్క గంగవరప్రసాద్ తిరుపత పాతి సాయి, మర్రె విగ్నేశ్వర రావు, గూడూరి కొండబాబు, అధికార ప్రతినిధి సజ్జ సుబ్బు, జనసేన నాయకులు గాజులు గోపికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపాప్రసాద్, జనసేన నాయకులు గుండుమోగుల సురేష్, నల్లగంచు రాంబాబు, మాదాసు ఇందు, అడ్డగర్ల సురేష్, అడబాల మురళి, చాపల రమేష్, జగత్ సోమశేఖర్, పిడుగు మోహన్ బ్రదర్స్, పాలూరి బూరయ్య, ఏపూరి సాయి, సోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్, భార్గవ్, దంగేటి చందు, బత్తిరెడ్డి రత్తయ్య, వానపల్లి సాయిరాం, మేది శెట్టి మాణిక్యాలరావు, ములగాల శివ, కాజురూరి మల్లేశ్వరరావు ప్రసాద్, ద్వారబంధం సురేషు, నరాల శెట్టి జాన్ శెట్టి ప్రసాద్ సంతోష్ వీరమహిళలు పెంటపాడు మండల మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షురాలు వెజ్జు రత్నకుమారి, అడపా జమునా, మధు శ్రీ తదితరులు పాల్గొన్నారు.