మోపిదేవి మండల జనసేన పార్టీ సమావేశం

అవనిగడ్డ నియోజకవర్గం: మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్ అధ్యక్షతన మండల స్థాయి పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రత్న గోపాల్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మన మండలంలో ఉన్న పార్టీ మండల కమిటీ సభ్యులు, మండల స్థాయి నాయకులు, గ్రామ అద్యక్షులు, వీర మహిళలు మరియు ముఖ్యంగా జనసైనికులు మన మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్వర్యంలో అందరం కలిసి పార్టీకి ఒక పెద్ద ఎత్తున విరాళం అందించాలి అని నిర్ణయించడం జరిగింది. కావున మీ వంతు సహకారంగా మీ ఒక్క రోజు సంపాదన పార్టీకి విరాళంగా ఇచ్చి మన పార్టీ మన బాధ్యత అనే ఉద్దేశంతో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు మన పార్టీకి అండగా నిలుద్దాం అని విన్నపించడం జరిగింది. అలాగే పుట్టిన రోజు సందర్భంగా మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షతన గ్రామ పార్టీ అధ్యక్షులు అధ్వర్యంలో ప్రతి గ్రామంలో మండలంలో ఉన్న ప్రతి ఒక్క జనసేన పార్టీ శ్రేణులు పాల్గొని పుట్టిన రోజు వేడుకలు సెప్టెంబర్ 2వ తేది సాయంత్రం 4:00 నుండి చేయ్యాలి అని నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశానికి మోపిదేవి మండల సీనియర్ నాయకులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, జనసైనికులు పాల్గొన్నారు.