అమ్మవారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు: బండారు శ్రీనివాస్

డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, మండల కేంద్రమైన ఆలమూరు దేవి కాలని వద్ద కొన్ని సంవత్సరాల నుండి దుర్గమ్మ ఆలయ కమిటీ వారు నిలబెడుతూ కొలుస్తున్న జగన్మాత అమ్మవారిని, ఈ ఏడాది కూడా నవరాత్రుల ప్రారంభంలో నిలబెడుతున్న సంధర్బంగా కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జీ బండారు శ్రీనివాస్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సంధర్బంగా బండారు శ్రీనివాస్ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి తనలోని కామ, క్రోద, మధ, మాత్సర్య, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించుకొనుటకు, ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు అని, చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి తెలుగుప్రజలు జరుపుకుంటారని అన్నారు. చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు అని, ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం అన్నారు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు అన్నారు. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మనలోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలపై విజయం సాధించడమే విజయదశమి అంతరార్థం అని శ్రీనివాస్ అన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులు, తెలుగు ప్రజలు, కొత్తపేట నియోజకవర్గ ప్రజలు, జనసైనికులు అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ.. కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జీ బండారు శ్రీనివాస్ ప్రజలందరికీ దసరా మ‌రియు విజయ దశమి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్య క్రమంలో సీనియర్ నాయకులు, తాళ్ళ డేవిడ్, చింతపల్లి సత్తిపండు, కట్టా రాజు, పెట్టా రంగనాథ్, లంకే సతీష్, దాసి మోహన, కోట వరలక్ష్మి, కొండేటి హేమ దేవి, చల్లా వెంకటేశ్వరులు, చల్లా బాబీ, శిరిగినీడి పట్టాభి, పసుపులేటి సాయిబాబా జనసైనికులు పాల్గొన్నారు.