వేములదీవి గ్రామంలో పర్యటించిన నాయకర్

నర్సాపురం మండలం వేములదీవి తూర్పు పంచాయతి మరియు బియ్యపుతిప్ప గ్రామాలలో జనసేన పార్టీ నర్సాపురం ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మడి నాయకర్ సోమవారం పర్యటించడం జరిగింది. ఇటీవల గ్రామంలోని మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ సచివాలయం ఎదుట నిరసన తెలిపిన విషయంపై గ్రామంలోని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు అనేక సమస్యలను నాయకర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మంచినీటి సమస్యను ప్రజలు విన్నపించారు. గ్రామంలో రెండు రోజులకు ఒకసారి కుళాయిలు వస్తున్నాయని, అవి కూడా సరిగా రావడంలేదని, నీరు మురికిగా వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ వేములదీవి, బియ్యపుతిప్ప గ్రామాల్లో మంచినీటి సమస్య అధికంగా ఉందని, నీటి కొరతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టేలా పంచాయతీ పాలకులు మరియు అధికారులు చర్యలు తీసుకువాలని అన్నారు. వెంటనే గ్రామంలో మంచినీటి సమస్యపై అధికారులు దృష్టి సారించి, సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణింంచిన వారి పలు కుటుంబాలను పరామర్సించారు. ఆయన వెంట జనసేన రాష్ట్ర మత్స్యకార విభాగ కమిటీ కార్యదర్శి తిరుమాని సీతామహాలక్ష్మి, జిల్లా సంయుక్త కార్యదర్శి బందెల రవీంద్ర, తోట నాని, తిరుమాని దుర్గారావు, దావీదు,సంగాని త్రిమూర్తులు, అర్జునరావు, సూర్యనారాయణ, శ్రీరామ్,సుబ్బారావు మరియు గ్రామ పెద్దలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.