డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పరిశీలించిన తీగల చంద్రశేఖర్

నెల్లూరు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మరణించిన వారి పేర్లు మరియు గతంలో ఇక్కడ నివాసముండి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వాటిని తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ కోరారు. జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పలు వార్డులలో బి.ఎల్.ఓ దగ్గర ఉన్న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పై స్పెషల్ వెరిఫికేషన్ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలిసి పోలింగ్ స్టేషన్లో వారీగా పరిశీలన కార్యక్రమం నిర్వహించామని అయితే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో అనేక పేర్లు తొలగింపులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒక ఇంటిలో నివాసం ఉంటున్న వారి ఓట్లు వివిధ పోలింగ్ స్టేషన్లలో నమోదు అయినట్లు గుర్తించామని తెలిపారు. మరణించిన మరియు నివాసం లేని వారి పేర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని బూత్ లెవెల్ ఆఫీసర్లకు తెలియజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్ కుమార్, నాయకులు సాయి, శివ, కుమార్, శ్రీనాథ్, వంశీ, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.