మూడో టెస్ట్: భారీ స్కోర్‌ దిశగా ఆసీస్

సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 244 పరుగులకు ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియాకు 94 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ (13), పకోవ్‌స్కీ ( 10) వెంటవెంటనే ఔటయినప్పటికీ స్మిత్‌( 81), లబుషేన్ (73) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాని పటిష్ట స్థితిలో నిలిపారు. ముఖ్యంగా స్మిత్‌.. భారత బౌలర్స్‌పై ఎదురు దాడి చేస్తూ స్కోరు వేగాన్ని పెంచాడు. ఇక సెంచరీకు చేరువవుతున్న సమయంలో అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

ఇక మాథ్యూ వేడ్‌( 4) తొందరగానే పెవీలియన్ చేరినప్పటికీ, ఆల్‌రౌండర్ గ్రీన్(84), కెప్టెన్ టిమ్ పైన్(39) మాత్రం బౌండరీలతో రెచ్చిపోయారు. ఫోర్స్, సిక్సర్లతో సిడ్నీ గ్రౌండ్‌ని హోరెత్తించారు. టీ సమయానికి గ్రీన్ ఔట్ కాగా, పైన్‌తో పాటు కమ్మిన్స్‌(0) క్రీజులో ఉన్నాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం ఆరు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేయగా, 406 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్స్‌లో అశ్విన్ , సైనీలు చెరో రెండు వికెట్స్ తీయగా, బుమ్రా, సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.