ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇంకా 6 నెలలే

  • ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తున్నాయి, కొత్త ప్రభుత్వం రాబోతుంది
  • జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి: జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు నాయకులకు కార్యక్రమానికి వెళ్లొద్దంటూ పోలీస్ అధికారులు నోటీసు జారీ చేసి అక్రమంగా గృహా నిర్బంధించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు శ్రీ శతఘ్ని న్యూస్తో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకే మా అధినేత పవన్ ఆశయం.. ఆ దారిలోనే మేము నడుస్తున్నాము. ప్రజా వ్యతిరేకత విధానాలపై నిరంతరం పోరాటం చేస్తాము. అధికారం వాళ్లతో వైసిపి నాయకులు చేస్తున్న అక్రమ ఇసుక దోపిడీని వెంటనే నిలిపివేయాలని నేడు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడితే ఆదివారం రాత్రి నుంచే అక్రమంగా మా నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమ అరెస్ట్ చేయటంను జనసేన పార్టీ తరఫునుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామంటే ఎందుకు అంత భయం అంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అయిన ప్రజలకు ఎలా మంచి చేయాలనే ప్రయత్నాలు చేయాలని వాటి మీద దృష్టి పెట్టాలని అన్నారు. ఇలాగే జరిగితే మీకు కాదు 175 సీట్లు మాకు వస్తాయంటు, ప్రజా వ్యతిరేకత విధానాలపై మాత్రమే మేము పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇలాంటి అరాచక పాలన ఇకనుంచి మానుకోకపోతే రాష్ట్రంలో ఈ పాలనకు ఇంకా 6 నెల్లలు మాత్రమే అంటు తనదైన శైలిలో హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), జనసేన పార్టీ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటిఎంసీ) అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, ఎంటిఎంసీ కార్యదర్శి షేక్ వజీర్ భాష, మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, చిన్నకాకాని గ్రామ ఉపాధ్యక్షులు దానబోయిన శ్రీనివాస్ యాదవ్, చిల్లపల్లి యూత్ అధ్యక్షుడు మేకల సాయి తదితరులు పాల్గొన్నారు.