నేడు బడ్జెట్‌పై ఉభయసభల్లో చర్చ

హైదరాబాద్‌: శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది. ఈసందర్భంగా మంత్రి హరీశ్‌ రావు చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఆసరా పింఛన్లు, సౌర విద్యుత్‌, హరితహారం, ఉద్యోగులకు ఆరోగ్య పథకం, కేసీఆర్‌ కిట్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఏర్పాటుపై చర్చ జరుగుతుంది.

అదేవిధంగా మండలి ప్రశ్నోత్తరాల్లో ఉచిత తాగునీటి పథకం, భూముల డిజిటల్‌ సర్వే, గిరిజన పంచాయతీల్లో చౌకధర దుకాణాలు, రైతుబీమా పరిహారం చెల్లింపు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల వేతనాల పెంపు, విమానయాన రంగం అభివృద్ధిపై సభ్యులు చర్చించనున్నారు. ఆయా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 15న ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు గత గురువారం (మార్చి 18న) అసెంబ్లీలో, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.