మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయాలి: జనసేన డిమాండ్

మదనపల్లి: ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ వున్న మదనపల్లె టమోటో మార్కెట్ కు వైస్సార్సీపీ ప్రభుత్వం షాక్. వేలకోట్ల వ్యాపారం జరిగే మదనపల్లి టమోటా వ్యాపారుల ఆశలు అడియాశలు అయ్యాయి. మదనపల్లికి కాకుండా కర్నూల్ జిల్లా పాపిలికి ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ ను మళ్ళించడం దురదృష్టకరం. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల చేత గానీ తనం వల్ల మదనపల్లెకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అందరూ కలిసి మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని ఈ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయలేకపోతే జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మదనపల్లిలో టమోటా యూనిట్ ని ఏర్పాటు చేసి మదనపల్లిలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని గంగారపు రాందాస్ చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, ఐటీ విభాగ నాయకులు జగదీష్, మదనపల్లి రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, సనా ఉల్లా, గౌతమ్, రెడ్డి శేఖర్, నవాజ్, రాజా రెడ్డి, అఖిల్, నవీన్, శ్రీకాంత్, ఉమా, యష్ తదితురులు పాల్గొన్నారు.