ఎస్వీ రంగారావుకు ఘన నివాళులు

విజయవాడ: ఎస్వీ రంగారావు 49వ వర్ధంతి సందర్భంగా ఆయనకు మంగళవారం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్వీ రంగారావు చనిపోయి నేటికీ 49 సంవత్సరాలు అయినా నటరంగంలో ఘటోత్కచుడు క్యారెక్టర్ మరిపించడానికి నేటికీ మరొకరు లేరు.. అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆయనను ఇలా స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఆయన నిజ జీవితంలో కూడా మహోన్నతమైన వ్యక్తి అనేకమందికి సహాయం చేస్తూ, భారత రక్షణ రంగానికి ఆ రోజుల్లోనే పదివేల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిన వ్యక్తి అని తిరుపతి అనూష కొనియాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సురేష్, పసుపులేటి కృష్ణ, సుధా బత్తుల సూరిబాబు, మహేశ్వరి, ఉమామహేశ్వరరావు, త్రినాధ్ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.