పవనన్న ప్రజా బాట కార్యక్రమానికి అనూహ్య స్పందన

  • 50వ రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట కార్యక్రమం
  • డాక్టర్ కందులకు సాదర స్వాగతం పలుకుతున్న ప్రజలు
  • నేరుగా సమస్యలు అడిగి తెలుసుకుంటున్న డాక్టర్ కందుల

విశాఖపట్నం దక్షిణ: ప్రజా సేవే తన లక్ష్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం బుధవారనికి 50వ రోజుకు చేరుకుంది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటిస్తూ ప్రజల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల తర్వాత అధికార మార్పిడి తద్యమని చెప్పారు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులపై వేధింపులకు పాల్పడుతుందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించకుండా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. జనసేన ప్రజల పక్షాన ప్రజా సమస్యల కోసం నిరంతరంగా పోరాటం చేస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికలలో ప్రజల తమ ఓటుతో వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

నవ వధువుకు పట్టుబట్టలు, బంగారు తాళిబొట్టు పంపిణీ.. 39వ వార్డు కోటవీధి ప్రాంతంలో నవ వధువు అనితకు డాక్టర్ కందుల నాగరాజు బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నవవధువు అనిత తల్లిదండ్రులు దేవుడమ్మా, పేరు సన్యాసిరావుతో పాటు జనసేన నాయకులు, వీరమహిళలు ప్రణీత్, సందీప్, సూరి, సమీర్, అంతోని, రఘు, రామారావు, కిరణ్, ప్రసాద్, సన్యాసిరావు, గాజుల శ్రీను, జనసేన రమేష్, అనిల్, పద్మ, హేమ, దుర్గ, మంగ, జానకి, జాన్సీ, రాజేశ్వరి, లలిత, వసంత, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.